వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓ సలహా ఇచ్చారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి జగన్ తప్పుకోవడం మేలని సూచించారు. నైతిక విలువలు ఏమైనా జగన్ లో మిగిలి ఉంటే, అధ్యక్ష పదవిని నచ్చిన ఎమ్మెల్యేకి అప్పగించాలని హితవు పలికారు. అధ్యక్షుడి హోదాలో ఉండే అర్హత జగన్ కు లేదన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ, నెలకు 11 సార్లు కోర్టుకు వెళ్లే వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా సమర్థంగా పనిచేస్తారా? ప్రజలకు న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడు అంటే ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, కానీ, జగన్ కేసులో ఎన్నో వేల కోట్ల రూపాయలు అక్రమార్జనకు గురైనట్టు సీబీఐ పేర్కొందని, 16 నెలలు జైల్లో కూడా ఉన్నాడని, అయినాగానీ జగన్ మాత్రం పార్టీ అధ్యక్ష పదవిని వీడడం లేదని అన్నారు.
గతంలో బస్సులు, రైళ్ల యాక్సిడెంట్లు జరిగిన సందర్భాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని, కానీ, బరితెగించిన జగన్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని విమర్శించారు. ఆయనపై అక్రమార్జన కేసు, అవినీతి కేసు ఇలా పలు కేసులు ఉన్నాయని, సీబీఐ ఇటీవలే 11వ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని ఎత్తిచూపారు. భవిష్యత్తులో ఏ పార్టీ కూడా జగన్ పార్టీని విలీనం చేసుకోదని, కనీసం దగ్గరకు కూడా రానీయదని చెప్పారు.
More Telugu News
-
భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు