భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల మధ్య భేటీ జరగనుందా? ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా భేటీ అసాధ్యమనే చెప్పొచ్చు. అయితే సార్క్ సమావేశాల్లో భాగంగా ఈ భేటీని భారత విదేశాంగ వర్గాలు మాత్రం తోసిపుచ్చడం లేదు. నేపాల్ రాజధాని ఖాట్మండూలో రెండు రోజుల పాటు జరగనున్న సార్క్ సదస్సులో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ రేపు బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
సదస్సుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో రెండు దేశాల ప్రధానుల మధ్య భేటీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ "ఇప్పటిదాకా మోదీతో భేటీ కోసం పాక్ ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. అయితే రెండు రోజుల పాటు ఒకే వేదికపై వారిద్దరూ ఉంటున్నారు" అని వ్యాఖ్యానించారు. అయితే ఇరు దేశాల ప్రధానుల మధ్య భేటీ జరగదని మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో మోదీ, షరీఫ్ ల మధ్య భేటీ జరిగే అవకాశాలున్నాయన్న వాదన బలపడుతోంది.
More Telugu News
-
భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు