గ్రంథాలయంలోకి అమ్మాయిలను అనుమతించండి... మీరు వివరణ ఇవ్వండి: అలహాబాద్ హైకోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్రంథాలయంలోకి అమ్మాయిలను అనుమతించండి... మీరు వివరణ ఇవ్వండి: అలహాబాద్ హైకోర్టు

గ్రంథాలయంలోకి అమ్మాయిలను కూడా అనుమతించాలి అని అలహాబాద్ హైకోర్టు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి స్పష్టం చేసింది. అలాగే అమ్మాయిలను అనుమతిస్తే ఇప్పుడు వస్తున్నదానికి నాలుగు రెట్లు ఎక్కువగా అబ్బాయిలు వస్తారంటూ వ్యాఖ్యానించిన వైస్ ఛాన్స్లర్ జమీరుద్దీన్ షా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మహిళా విద్యార్థినుల పట్ల ఏఎంయూ వైస్ ఛాన్స్లర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని న్యాయ విద్యార్థిని, సామాజిక కార్యకర్త దీక్షా ద్వివేదీ పిల్ దాఖలు చేయడంతో అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. వివాదం పెరిగి పెద్దదవడంతో లైబ్రరీలోకి విద్యార్థినులను అనుమతించే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని ఏఎంయూ వర్గాలు కేంద్ర మానవ వనరులశాఖకు తెలిపాయి.

More Telugu News