సికింద్రాబాద్ ప్రజలకు రుణపడి ఉంటా: దత్తాత్రేయ
తనను గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి హైదరాబాదు వచ్చిన ఆయన మాట్లాడుతూ, కార్మికుల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టనుందని ఆయన పేర్కొన్నారు.