నవ్యాంధ్ర రాజధాని... మరో సింగపూరే!: చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నవ్యాంధ్ర రాజధాని... మరో సింగపూరే!: చంద్రబాబు

నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని సింగపూర్ ను తలపించేలా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ లో తొలిరోజు పర్యటన సందర్భంగా ఆయన ఆ దేశ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ తో పాటు అక్కడి తెలుగు ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సింగపూర్ లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. నవ్యాంధ్రప్రదేశ్ లోనూ పర్యాటక రంగ విస్తరణకు అవకాశాలున్నాయని చెప్పిన చంద్రబాబు, రాజధానిని సింగపూర్ లా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు సింగపూర్ ప్రభుత్వం అక్కడి నదినే ప్రక్షాళన చేసిన వైనాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఏపీలో బీచ్ టూరిజం అభివృద్ధికి సహకరించాలని ఆయన సింగపూర్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని 13 ఓడరేవులను ఏ తరహాలో అభివృద్ధి చేయనున్నామన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా సింగపూర్ ప్రభుత్వానికి వివరించారు.

More Telugu News