కాంగ్రెస్ సభ్యుల దాడిలో గవర్నర్ విద్యాసాగర్ రావుకు గాయం
మహారాష్ట్ర శాసనసభలో బీజేపీ ప్రభుత్వం మూజువాణి ఓటుతో బలపరీక్ష నెగ్గిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో, మూజువాణి ఓటు విధానాన్ని వ్యతిరేకిస్తూ ఐదుగురు కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ విద్యాసాగర్ రావును ఘెరావ్ చేశారు. అంతేకాకుండా, అసెంబ్లీ బయట కాంగ్రెస్ సభ్యులు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో విద్యాసాగర్ రావు గాయపడ్డారు. ఆయన ఎడమ చేతికి గాయమైంది. దీంతో, దాడికి పాల్పడ్డ ఐదుగురు సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.