అగ్రకులాల వారంతా విదేశీయులే: బీహార్ సీఎం
అగ్రకులాల వారంతా 'విదేశీయులు, ఆర్యుల జాతి వారసులు' అంటూ బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మంఝి మరో వివాదానికి తెర తీసారు. బెథియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ అగ్ర కులాల వారు విదేశాల నుంచి వచ్చి స్థిరపడ్డారని వ్యాఖ్యానించారు. కేవలం దళితులూ, అడవి బిడ్డలు మాత్రమే స్వదేశీయులని అన్నారు. జితిన్ రామ్ వ్యాఖ్యల పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కులాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పెంచేలా జితిన్ మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత సుశీల్ కుమార్ డిమాండ్ చేసారు.