తోకచుక్కపై దిగనున్న అంతరిక్ష నౌక: సైన్స్ చరిత్రలో తొలిసారి
చరిత్రలో తొలిసారిగా ఒక అంతరిక్ష నౌక తోకచుక్కపై దిగనుంది. 67పి/ చురియుమోవ్ - జిరాసిమెంకో అనే తోకచుక్కపై యురోపియన్ స్పేస్ ఏజెన్సీ రోదసిలోకి పంపిన రోసేట్టా అంతరిక్ష నౌక ఫిలేయి అనే బుల్లి నౌకను బుధవారం దింపనుంది. శాస్త్రవేత్తలు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే తోకచుక్కపై తొలిసారి దిగిన మానవ తయారీ యంత్రంగా 'ఫిలేయి' రికార్డులకెక్కనుంది. రష్యాలో తయారైన రోసెట్టా 2004 మార్చి 2న ఆకాశంలోకి దూసుకెళ్ళింది. అదే ఏడాది ఆగస్టు 6న తోకచుక్క కక్ష్యను చేరింది.
తోకచుక్కపై దిగిన తరువాత కొన్ని తవ్వకాలను జరిపి ఉపరితల పరిశీలన, సూర్యుని కాంతి మార్పుల వల్ల ఏర్పడే పరిణామాలు తదితరాలను ఫిలేయి పరిశీలించనుంది. అయితే తోకచుక్కపై దిగిన తరువాత ఫిలేయి జీవితకాలం రెండున్నర రోజులు మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఫిలేయి మదర్ షిప్ రోసేట్టా మాత్రం 2015 వరకు తోకచుక్క కక్ష్యలోనే పరిభ్రమిస్తుంది.