ఇన్ స్టాగ్రామ్ సైట్ లో చేరిన మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇన్ స్టాగ్రామ్ సైట్ లో చేరిన మోదీ

మొబైల్ నుంచి ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకునే ఆన్ లైన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఇన్ స్టాగ్రామ్'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖాతా తెరిచారు. ప్రస్తుతం మయన్మార్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి ఫోటోలను పోస్టు చేశారు. తొలుతగా '25వ ఏషియన్ సమ్మిట్' వేదిక ఫోటోను మోదీ పోస్టు చేశారు. అంతేకాక "హల్లో వరల్డ్! ఇన్ స్టాగ్రామ్ సైట్ లో చేరడం గొప్పగా ఉంది. ఏషియన్ సమ్మిట్ నుంచి నా తొలి ఫోటో ఇది" అని కామెంట్ కూడా చేశారు. కేవలం 13 నిమిషాల్లోనే 35వేల మంది మోదీని ఈ సైట్ లో ఫాలో అయ్యారు.

More Telugu News