వంట గ్యాస్ కు కిలోకు రూ.20 చొప్పున ప్రభుత్వ సబ్సిడీ
వంట గ్యాస్ కు కిలోకు రూ.20ల చొప్పున సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సరికొత్త విధానం వల్ల దిగువ మధ్య తరగతి, పేద వారికి చాలా ప్రయోజనం ఉంటుందని కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ వెల్లడించారు. పెద్ద సిలిండర్లు కొనలేక, చిన్న సిలిండర్లకు సబ్సిడీ రాక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) సంస్థలు షాంపూలను చిన్న ప్యాకెట్లలో మార్కెట్ చేస్తున్నట్టే, ఐదు కిలోల సిలిండర్లను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. వాటికి కూడా కిలో లెక్కన సబ్సిడీ ఇచ్చే ఆలోచన ఉన్నట్టు వివరించారు.