Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎస్సెమ్మెస్ చూపించలేదని భార్యను టెర్రస్ పైనుంచి తోసేశాడు!

ఓ వ్యక్తి తన భార్యను బంగ్లా టెర్రస్ పై నుంచి కిందికి తోసేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఆమె తన సెల్ ఫోన్ లో ఎస్సెమ్మెస్ ను భర్తకు చూపించకపోవడమే ఘటనకు కారణం. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చావుబతుకుల్లో వుంది. నగరంలోని లాసూడియా ప్రాంతంలోని శ్రీనికేతన్ బంగ్లాలోకి నాలుగు రోజుల క్రితమే ఆనంద్ శర్మ, దీప్ మాలా శర్మ దంపతులు షిఫ్టయ్యారు. ఆదివారం ఉదయం టీ తీసుకురమ్మని భార్యను టెర్రస్ పైకి పిలిచాడు ఆనంద్ శర్మ. కొద్దిసేపు వారిద్దరి మధ్య అక్కడ వాగ్యుద్ధం జరిగింది. కోపం పట్టలేని ఆనంద్ శర్మ భార్యను అక్కడి నుంచి కిందికి తోసేశాడు. దీంతో, దీప్ మాలా శర్మ తలకు, ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న లాసూడియా పోలీసులు ఆనంద్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనకు గల కారణాలను పోలీసులు వివరిస్తూ, గత కొంతకాలంగా ఆమె తన సెల్ ఫోన్లోని టెక్ట్స్ సందేశాలను భర్తకు చూపేందుకు నిరాకరిస్తుండడమే ఘటనకు కారణమని తెలిపారు.

More Telugu News