Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భూమాను ఎందుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారో వివరించండి: జైళ్ల డీఐజీ

వైఎస్సార్సీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ఎందుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని జైళ్ల శాఖ డీఐజీ ఆదేశించినట్టు సమాచారం. భూమా నాగిరెడ్డిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందజేయడంపై ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన కథనంపై స్పందించిన జైళ్ల శాఖ డీఐజీ నంద్యాల సబ్ జైలు సూపరిండెంట్ ను వివరణ కోరారు. కాగా, హత్యాయత్నం నేరంపై నంద్యాల టీడీపీ నేతలు భూమాపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News