ఫడ్నవిస్ ప్రభుత్వంలో 2:1 నిష్పత్తిలో శివసేనకు పదవులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫడ్నవిస్ ప్రభుత్వంలో 2:1 నిష్పత్తిలో శివసేనకు పదవులు!

మహారాష్ట్రలో పాగా వేయాలని చూసిన శివసేనకు అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పొత్తుకు సంబంధించి వెంటనే స్పష్టత ఇవ్వాలని శివసేన డెడ్ లైన్ విధించిందట. అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పద్నాలుగు రోజుల సమయం ఇచ్చారు. అప్పటికల్లా పొత్తుపై ఏదీ తేల్చకపోతే వ్యతిరేక ఓటు వేస్తామని సేన హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, 2:1 నిష్పత్తిలో ప్రభుత్వంలో పదవులు తీసుకునే ప్రతిపాదనకు శివసేన అంగీకరిస్తుందని అంటున్నారు. మొత్తం 32 మంది మంత్రులతో ఉండే ఫడ్నవిస్ క్యాబినెట్ లో 20 మంది బీజేపీ వారయితే, పది శివసేనకు ఇవ్వనున్నారట. మిగతా రెండు మంత్రి పదవులు చిన్న భాగస్వామ్య పక్షాలకు వెళతాయి. ఇదిలాఉంటే, సేన ఉపముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

More Telugu News