Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అంతర్జాతీయ షూటింగ్ ఫెడరేషన్' అథ్లెట్స్ కమిటీ ఛైర్మన్ గా అభినవ్ బింద్రా

ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 'ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్' (ఐఎస్ఎస్ఎఫ్) అథ్లెట్స్ కమిటీ ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు. ఐఎస్ఎస్ఎఫ్ ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా వెల్లడించింది. 32 ఏళ్ల బింద్రా ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ షూటర్ గా అవతరించాడు. ఈ క్రమంలో ఐఎస్ఎస్ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ లో అతను సభ్యుడవుతాడు. ఈ సందర్భంగా బింద్రా మాట్లాడుతూ, "నాకే కాకుండా దేశానికి కూడా ఇది గొప్ప గౌరవం. షూటర్ల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకునేందుకు నాకు ఈ బాధ్యత అప్పగించారు. ఈ క్రమంలో చివరి వరకు న్యాయం చేసేందుకే చూస్తాను" అని పేర్కొన్నాడు.

More Telugu News