ఏపీ రాజధానికి భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ రాజధానికి భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులు

ఏపీ సర్కారుకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. మొన్నటిదాకా రాజధాని ఎక్కడ నిర్మించాలన్న విషయంపై మల్లగుల్లాలు పడి చివరికి విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని ప్రకటించారు. ఇప్పుడక్కడ రాజధాని నిర్మించాలంటే, పెద్ద ఎత్తున భూములు అవసరమవుతాయి. అయితే, కొత్త రాజధాని కోసం భూములిచ్చేందుకు ప్రజలే ముందుకు వస్తారని భావించిన సర్కారుకు షాక్ తగిలింది. సాగు భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. మంగళవారం రాత్రి ఉండవల్లి, పెనుమాక రైతులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. చిన్న, సన్నకారు రైతుల భూములను లాగేసుకునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. మరోవైపు, తుళ్ళూరులో జరిగిన సమావేశంలోనూ అధికారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వానికి భూములు అప్పగించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అందుకు తమ డిమాండ్లను సర్కారు అంగీకరించాల్సి ఉంటుందని అక్కడి రైతులు అంటున్నారు.

More Telugu News