భారత్ మాతో శత్రుత్వం పెట్టుకోవాలని చూస్తోంది: పాక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్ మాతో శత్రుత్వం పెట్టుకోవాలని చూస్తోంది: పాక్

భారత్ కొత్త ప్రభుత్వం పాకిస్తాన్ తో శత్రుత్వం పెట్టుకునేందుకు యత్నిస్తోందని పాక్ ప్రధాన సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ తో చర్చల నేపథ్యంలో సెనేట్ స్టాండింగ్ కమిటీతో ఇస్లామాబాద్‌లో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్-పాకిస్తాన్ చర్చల్లో కాశ్మీర్ అంశం లేవనెత్తరాదన్న భారత్ షరతు తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు భారత్ అంగీకరిస్తే, దానికి అనుగుణంగా పాక్ పనిచేస్తుందని సెనేట్ స్టాండింగ్ కమిటీ సభ్యులతో అజీజ్ అన్నట్లు ఓ పత్రిక తన కథనంలో పేర్కొంది. కాగా, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం భారత్, పాకిస్థాన్ చర్చలు కాకుండా కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి మరో అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దుల వెంబడి భారత బలగాల దాడిలో తమ దేశ ప్రజలు 14 మంది ప్రాణాలు కోల్పోగా, 65 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆయన తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలే ముందుగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.

More Telugu News