Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ జిదానేపై మూడు నెలల నిషేధం

ఫుట్ బాల్ స్టార్ జినెదిన్ జిదానే మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. ఈ మేరకు అతడిని మూడు నెలల పాటు నిషేధిస్తూ స్పానిష్ ఫుట్ బాల్ ఫెడరేషన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. స్పానిష్ ఫుట్ బాల్ అసోసియేషన్ లో జిదానేకు లెవెల్ 3 క్వాలిఫికేషన్ లేదు. యూఈఎఫ్ఏ లైసెన్స్ మాత్రమే ఉంది. అయినా నిబంధనలకు విరుద్ధంగా జిదానే, రియల్ మాడ్రిడ్ కాస్టిల్లా జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు. దీనిపై కోచ్ లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే సెనెఫ్ ఎస్కులాస్ డైరెక్టర్ మిగ్యుల్ గలాన్ స్పానిష్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అసోసియేషన్, జిదానే నిబంధనలను అతిక్రమించాడని తేల్చింది. దీంతో అతడిపై మూడు నెలల పాటు నిషేధం విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

More Telugu News