శ్రీశైలం డ్యాం భద్రతపై కేంద్ర జల వనరుల బృందం ఆందోళన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీశైలం డ్యాం భద్రతపై కేంద్ర జల వనరుల బృందం ఆందోళన

శ్రీశైలం డ్యాం భద్రతపై కేంద్ర జల వనరుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం శ్రీశైలం రిజర్వాయర్ ను జల వనరుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా డ్యాం భద్రతపై దృష్టి సారించిన సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నీటి పరిమితి మరింత పెరిగితే డ్యాం నిలవడం కష్టమేనని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన గేట్లకు అదనంగా మరో గేటును ఏర్పాటు చేయాలని సూచించారు.

More Telugu News