కేసీఆర్ తో తలసాని, తీగల, చల్లా భేటీ!
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును మంగళవారం ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాసయాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలు కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ తో భేటీ అయిన వారు టీఆర్ఎస్ లో చేరే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. బుధవారం వీరు ముగ్గురు టీఆర్ఎస్ లో చేరనున్నారు.