Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్రం నుంచి నిధులు లేకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యం?: లోకేష్

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోకుండా బంగారు తెలంగాణ కల ఎలా సాకారమవుతుందని టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రశ్నించారు. హైదరాబాదులోని టీడీపీ భవన్ లో విద్యార్థుల మేధోమథన సదస్సులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ కేవలం రెండుసార్లే ప్రధానిని కలిశారని అన్నారు. తెలంగాణలో టీడీపీ కార్యాలయాలను తగులబెడితే విద్యుత్ ఉత్పత్తవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బాటలోనే నడుస్తూ కుట్రరాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

More Telugu News