Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ గ్రిడ్ నిర్మిస్తాం: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ గ్రిడ్ నిర్మిస్తామని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వాటర్ గ్రిడ్ నిర్మాణానికి అంతర్జాతీయ ప్రమాణాలున్న కంపెనీలకే అవకాశం ఇస్తామని అన్నారు. ప్రభుత్వమే ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్ కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు.

More Telugu News