ఆధార్ సంఖ్యతో మొబైల్ సిమ్ ను అనుసంధానిస్తున్న కేంద్రం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆధార్ సంఖ్యతో మొబైల్ సిమ్ ను అనుసంధానిస్తున్న కేంద్రం

ఆధార్ సంఖ్యకు మొబైల్ సిమ్ ను కేంద్రం అనుసంధానించబోతున్నట్లు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఆర్ఎస్ శర్మ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం చాలా కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ, "యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కు మొబైల్ సిమ్ ను అనుసంధానించమని ప్రధానమంత్రి మాకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం దానిపైనే పని చేస్తున్నాము. కచ్చితంగా మేమీ సమస్యను పరిష్కరించుకోగల సామర్థ్యం ఉంది" అని సదరు సీనియర్ అధికారి వివరించారు. ఇలా చేయడం వలన లావాదేవీల సమాచారమంతా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. అదే గనుక జరిగితే భారతదేశ ప్రజల సాధికారత సాధనకు ఇది ఓ పరికరంగా ఉంటుందని ఢిల్లీలో జరిగిన ఎఫ్ఐసీసీఐ కార్యక్రమం అనంతరం మీడియాకు ఆ అధికారి వెల్లడించారు.

More Telugu News