ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ కు అనుమతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ కు అనుమతి

ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతి తెలిపింది. గుర్తింపు రద్దయిన 174 కళాశాలలు, విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా విచారణ చేపట్టిన కోర్టు, ఏఐసీటీఈ తనిఖీలకు లోబడే ప్రవేశాలు ఉంటాయని చెప్పింది. తనిఖీల్లో కళాశాలల గుర్తింపు రద్దయితే విద్యార్థులు కోర్టుకు రావద్దని సుప్రీం స్పష్టం చేసింది. అటు కళాశాలలు విద్యార్థుల ఫీజును ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని తెలిపింది. ఈ క్రమంలో కౌన్సెలింగ్ కు షెడ్యూల్ రూపొందించాలని, నవంబర్ 14లోపు కౌన్సెలింగ్ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశాలిచ్చింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసిన కోర్టు, కౌన్సెలింగుకు సంబంధించిన తుది ఉత్తర్వులు మంగళవారం ఇవ్వనుంది.

More Telugu News