బ్లౌజులపైనా మోదీ చిత్రాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్లౌజులపైనా మోదీ చిత్రాలు!

మోదీ గాలిపటాలు, మోదీ బాణాసంచా... ఇలా, మోదీ పేరు ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పుడు ఆయన చిత్రాలున్న బ్లౌజులు కూడా రంగప్రవేశం చేశాయి. ఢిల్లీలోని ఓ మార్కెట్లో ఈ తరహా బ్లౌజులు దర్శనమిచ్చాయి. కాషాయ రంగులో మెరిసిపోతున్న ఈ జాకెట్లపై మోదీ బొమ్మలతో పాటు, ఆకట్టుకునేలా జరీ వర్క్ కనిపిస్తుంది. పనిలోపనిగా, ఓ అవినీతి వ్యతిరేక సందేశం కూడా ఈ బ్లౌజు స్లీవ్స్ పై పొందుపరిచారు. ఈ బ్లౌజులు తయారు చేసిన దర్జీల్లో ఒకరైన మహ్మద్ ఇర్షాద్ మాట్లాడుతూ, కొందరు కోరిన మీదటే ఈ రకమైన బ్లౌజులు రూపొందించామని తెలిపారు. ఇది ప్రయోగాత్మకమని అన్నారు.

More Telugu News