శ్రీవారి సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 15 గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు. ఈ ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోవడంతో, వెలుపల భారీగా భక్తులు బారులు తీరారు. నిన్న శ్రీవారిని 71,318 మంది భక్తులు దర్శించుకున్నారు.

More Telugu News