గెలిచానని శుభాకాంక్షలు చెప్పొద్దు... కొంచెం ఓపిక పట్టండి: పంకజ్ అద్వానీ
ప్రపంచ ఛాంపియన్ గెలిచిన ఏ ఆటగాడైనా విజయం తాలూకు ఆనందాన్ని అనుభవిస్తాడు. అయితే, బిలియర్డ్స్ లో ఛాంపియన్ గా గెలిచిన పంకజ్ అద్వానీ తనకు వస్తున్న అభినందనలతో మజాను పూర్తిగా అనుభవించాల్సింది పోయి, తనకు శుభాకాంక్షలు చెప్పొద్దని అభ్యర్ధించాడు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరలేదని, తాను ఇంకో ఫార్మాట్ లో పోటీ పడాల్సి ఉందని తెలిపాడు. 'అందులో శుభవార్త కోసం ఎదురుచూడండి. అప్పుడు అభినందనలు తెలుపుదురు' అంటూ పంకజ్ తన మనోగతాన్ని వెల్లడించాడు. పంకజ్ అద్వానీ ఇప్పటి వరకు 150కి పైగా అంతర్జాతీయ ట్రోఫీలను సొంతం చేసుకున్నాడు.