వైసీపీలో నేను కొనసాగలేను: ఎంపీ కొత్తపల్లి గీత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైసీపీలో నేను కొనసాగలేను: ఎంపీ కొత్తపల్లి గీత

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగలేనని అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ సహకరించడం లేదని ఆమె తెలిపారు. ఈ క్రమంలో, భవిష్యత్తులోనూ బీజేపీ, టీడీపీలతో కలిసి పనిచేస్తానని ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎంపీల భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన గీత పైవిధంగా తెలిపారు. టీడీపీ సమావేశాలకు ఇకపైనా హాజరవుతానని అన్నారు. ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు.

More Telugu News