అమెరికాలో తుపాకీకి పనిచెప్పిన విద్యార్థి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో తుపాకీకి పనిచెప్పిన విద్యార్థి

అమెరికాలో తుపాకీ సంస్కృతి దుష్ఫలితాలకు ఈ ఘటన నిదర్శనం. అగ్రరాజ్యంలో గతకొంతకాలంగా స్కూళ్ళలో కాల్పుల ఉదంతాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, వాషింగ్టన్ లోని మేరీస్ విల్లే పిల్చుక్ హైస్కూల్ లో నెత్తురు చిమ్మింది. తుపాకీతో పాఠశాలలో ప్రవేశించిన జేలిన్ ఫ్రైబెర్గ్ అనే విద్యార్థి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో, ఓ విద్యార్థిని మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అనంతరం, ఫ్రైబెర్గ్ తనను తాను కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పులతో ఉలిక్కిపడిన పాఠశాల యాజమాన్యం వెంటనే విద్యార్థులను సమీపంలోని చర్చికి తరలించింది. విద్యార్థుల తల్లిదండ్రులెవరూ స్కూల్ వద్దకు రావద్దని సూచించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News