Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణా బోర్డు ఛైర్మన్ తో ఉమ భేటీ... టీఎస్ సర్కారుపై ఫిర్యాదు

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి అంశం ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ విషయంపై ఏపీ మంత్రి దేవినేని ఉమ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కృష్ణా బోర్డు ఛైర్మన్ ను కలిశారు. నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టీఎస్ గవర్నమెంట్ నిబంధనలను తుంగలో తొక్కి విద్యుదుత్పత్తి చేస్తోందని ఫిర్యాదు చేశారు.

More Telugu News