నా చెల్లి మరణ ధ్రువీకరణ పత్రాన్ని పంపుతా... అప్పుడైనా కళ్లు తెరవండి: భట్టి విక్రమార్క
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా చెల్లి మరణ ధ్రువీకరణ పత్రాన్ని పంపుతా... అప్పుడైనా కళ్లు తెరవండి: భట్టి విక్రమార్క

తెలంగాణలో ఎన్నో సమస్యలున్నప్పటికీ... వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం లేదని టీకాంగ్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డెంగీనే లేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య వెల్లడించడం అత్యంత దారుణమని... సమస్యను ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని మండిపడ్డారు. డెంగీతోనే తన చెల్లెలు మరణించిందని... ఆమె మరణ ధ్రువపత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తానని... అప్పుడైనా కళ్లు తెరవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల దోపిడీలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని భట్టి హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ కుటుంబ హవా నడుస్తోందని అన్నారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్... ఇప్పుడు సైలెంట్ అయిపోయారని చెప్పారు. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ ప్రజానీకం తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు.

More Telugu News