కోచి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు... అన్ని విమానాశ్రయాల్లో అప్రమత్తత
కేరళలోని కోచి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు లేఖ వచ్చింది. అహ్మదాబాద్ నుంచి కోచి వెళుతున్న విమానంలో బాంబు పెట్టినట్టు లేఖలో పేర్కొన్నారు. దీంతో, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. విమానాశ్రయంలోని అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భద్రతను మరింత పెంచారు. అటు, దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.