మోదీ పాకిస్థాన్ వ్యతిరేకి: పాక్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ పాకిస్థాన్ వ్యతిరేకి: పాక్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జరనల్ పర్వేజ్ ముషార్రఫ్ మరోమారు నోరు పారేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన పాకిస్థాన్ వ్యతిరేకిగా అభివర్ణించారు. అంతేకాక భారత్ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడి నుంచైనా తన భూభాగాన్ని రక్షించుకునేందుకు పాక్ సర్వ సన్నద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. టీవీటీఎన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ముషార్రఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ తన వైఖరిని మార్చుకోవాలి. మోదీ ముస్లిం వ్యతిరేకి మాత్రమే కాదు, పాకిస్థాన్ వ్యతిరేకి కూడా’ అని ముషార్రఫ్ చెప్పారు. భారత భూభాగంలో జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్ ప్రమేయం ఎంత మాత్రం లేదన్నారు. అయితే పాక్ లో జరుగుతున్న హింసలో మాత్రం భారత ప్రమేయానికి స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. భారత గూఢచార సంస్థ ‘రా’ అధికారులు పాక్ లో ధ్వంస రచనకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

More Telugu News