నల్ల కుబేరుల జాబితాలో సోనియా అల్లుడు వాద్రా?
నల్ల కుబేరుల జాబితాపై కాంగ్రెస్ భయపడుతోందన్న బీజేపీ వాదన నిజమేనని తేలుతోంది. ఎందుకంటే, సదరు జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ, వాద్రా చుట్టూ ఉచ్చు బిగించి కాంగ్రెస్ ను మరోమారు చావుదెబ్బ కొట్టాలని యత్నిస్తోందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి.
హర్యానాలో డీఎల్ఎఫ్ భూమి బదలాయింపు వ్యవహారంతో ఒక్కసారిగా వాద్రాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా నల్ల కుబేరుల జాబితాలో ఆయన పేరుందన్న లీకులను బీజేపీనే జారీ చేసిందన్న వాదనా లేకపోలేదు. నల్ల కుబేరుల జాబితాలో వాద్రా పేరుతో పాటు ఓ కేంద్ర మాజీ మంత్రి పేరు కూడా ఉందని ప్రచారం సాగుతోంది.