Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆళ్లగడ్డలో ఏడు నామినేషన్ల దాఖలు... నాలుగు తిరస్కరణ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉపఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అఖిల ప్రియ సహా, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ముగిసిన నామినేషన్ల గడువులోగా దాఖలైన ఏడు నామినేషన్లలో నాలుగు నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. నామినేషన్ పత్రాల్లో వివరాలు సంపూర్ణంగా లేని నేపథ్యంలో వాటిని తిరస్కరించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో బుధవారం నాటికి అఖిల ప్రియతో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. శోభానాగిరెడ్డి అకాల మరణం నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికకు అన్ని రాజకీయ పార్టీలు దూరంగా ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా రెండు రోజుల సమయముంది. ఈలోగా స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటే, అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. లేకపోతే వచ్చే నెల 8న ఎన్నికలు జరగడం ఖాయంగానే కనిపిస్తోంది.

More Telugu News