బీసీసీఐతో భేటీ అవ్వాలని భావిస్తున్న విండీస్ బోర్డు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీసీసీఐతో భేటీ అవ్వాలని భావిస్తున్న విండీస్ బోర్డు

బీసీసీఐతో నెలకొన్న సంక్షోభానికి చర్చలే పరిష్కారమార్గమని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అందుకే, బీసీసీఐతో సమావేశానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. భారత పర్యటనను సగంలోనే ముగించాలని విండీస్ ఆటగాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల బీసీసీఐ వారి క్రికెట్ బోర్డునే తప్పుబడుతోంది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డుపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది కూడా. విండీస్ తో అన్ని ద్వైపాక్షిక సిరీస్ లను రద్దు చేసుకుంటున్నట్టు మంగళవారం హైదరాబాదులో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే విండీస్ బోర్డు నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. బార్బడోస్ లో సమావేశమైన విండీస్ క్రికెట్ బోర్డు తాజా పరిణామాల పట్ల తీవ్రంగా కలత చెందుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేగాకుండా, భారత్ సిరీస్ మధ్యలోనే నిలిచిపోవడానికి గల కారణాలను విశ్లేషించేందుకు ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.

More Telugu News