రేపు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ 'ప్రజా దర్బార్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ 'ప్రజా దర్బార్'

గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దీపావళి నాడు రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటల నుండి 12గంటల వరకు రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా, గవర్నర్ దంపతులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా తమను కలసిన ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటు గవర్నర్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

More Telugu News