Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామోజీ, పరకాలకు వైకాపా ఎమ్మెల్యే లీగల్ నోటీసులు

ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారు పరాకాల ప్రభాకర్ కు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిన్న లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రభాకర్ మాట్లాడితే... కనీసం తన వివరణ తీసుకోకుండానే, దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలను ఈనాడులో ప్రచురించారని నోటీసులో పేర్కొన్నారు. నోటీసు అందిన 15 రోజుల్లోపు నష్ట పరిహారంగా రూ. 20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, చెవిరెడ్డి తండ్రికి పింఛను వస్తోందని... ఆర్థికంగా స్థితిమంతుడైన ఆయనకు పింఛన్ ఇవ్వాలా? అంటూ కొద్ది రోజుల క్రితం పరకాల వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, దీనిపై వైకాపా అధినేత జగన్ సమాధానం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వార్తలు 'ఈనాడు'తో పాటు పలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే, రామోజీ, పరకాలకు చెవిరెడ్డి నోటీసులు పంపారు.

More Telugu News