చంద్రబాబు మంచి పని చేసిండ్రా బాబు!: వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మెచ్చుకున్నారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు విశాఖపట్టణం వెళ్లిన ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు వల్లే పెను ముప్పుతప్పిందని అన్నారు. కేవలం గాలులు మాత్రమే తీవ్ర స్థాయిలో విశాఖను అతలాకుతలం చేశాయని, అదే స్థాయిలో వర్షాలు కూడా చుట్టుముట్టి ఉంటే ఆస్తి, ప్రాణ నష్టం అపారంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆపత్కాలంలో విశాఖ ప్రజలు చూపుతున్న మనోనిబ్బరం అనితరసాధ్యమని ఆయన పేర్కొన్నారు. చేయిచేయి కలిపి ప్రజలంతా ముందుకు సాగుతున్నారని, ముందు చూపు ఉన్న చంద్రబాబు పాలనలో విశాఖ తొందరగా కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలను అప్రమత్తం చేసి చంద్రబాబు మంచి పని చేశాడని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.