విండీస్ క్రికెట్ బోర్డుపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైన బీసీసీఐ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విండీస్ క్రికెట్ బోర్డుపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైన బీసీసీఐ!

తాజా పర్యటనలో టీమిండియా, విండీస్ మధ్య మిగతా అన్ని మ్యాచ్ లనూ నిలిపివేయాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) బీసీసీఐకి తన నిర్ణయం తెలిపింది. అటు ఆటగాళ్ళు కూడా తమ బోర్డు వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారు. సొంత ఖర్చులతో స్వదేశం వెళ్ళాలని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనిపై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మాట్లాడుతూ, "ఆటగాళ్ళతో వివాదాల కారణంగా విండీస్ బోర్డు మిగతా మ్యాచ్ లను క్యాన్సిల్ చేయాలంటూ బీసీసీఐకి సమాచారం అందించింది. ఆటగాళ్ళలో అంతర్గత సమస్యలే తమ నిర్ణయానికి కారణమని చెప్పింది. దీనిపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేసి, అటుపై, న్యాయపరమైన చర్యలు తీసుకోవడంపై ఆలోచిస్తున్నాం. విండీస్ బోర్డు నిర్ణయంపై షాక్ తిన్నాం" అని తెలిపారు.

More Telugu News