ముదిరిన వివాదం... స్వదేశం వెళ్ళే ఆలోచనలో విండీస్ క్రికెటర్లు
భారత్, విండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ మరోసారి ప్రమాదంలో పడింది. విండీస్ క్రికెటర్లకు, వారి బోర్డుకు మధ్య చర్చలు ఫలప్రదం కాలేదు. బోర్డు తమ పారితోషికంలో కోత పెట్టడాన్ని ఆటగాళ్ళు కొంతకాలంగా నిరసిస్తున్నారు. భారత్ తో తొలి వన్డే ఆరంభానికి ముందు బాయ్ కాట్ హెచ్చరిక పంపిన కరీబియన్లు బీసీసీఐ జోక్యంతో ఆ మ్యాచ్ లో పాల్గొన్నారు. తాజాగా, బోర్డుకు, ఆటగాళ్ళకు మధ్య వివాదం మరింత ముదిరింది. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు విండీస్ బోర్డు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో, విండీస్ క్రికెటర్లు ధర్మశాల వన్డే తరువాత, సొంత ఖర్చులతో స్వదేశం వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. టీమిండియాతో ఏకైక టి20, టెస్టు సిరీస్ ను బహిష్కరించాలని వారు భావిస్తున్నట్టు సమాచారం.