Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రమాదం నుంచి తప్పించుకున్న పవన్ కల్యాణ్

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఖమ్మం వెళుతుండగా, కొణిజర్ల వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పవన్ కల్యాణ్ కు గాయాలేమీ కాలేదు. అనంతరం, ఆయన మరో కారులో ఖమ్మం బయల్దేరి వెళ్ళారు. ఖమ్మంలో జీవితం చివరి దశలో ఉన్న శ్రీజ అనే బాలిక పవన్ కల్యాణ్ ను చూడాలని ఉందని కోరడం తెలిసిందే. ఆ బాలికను సంతోష పెట్టేందుకే పవన్ ఖమ్మం పయనమయ్యారు.

More Telugu News