నల్ల కుబేరుల వివరాలు వెల్లడించలేం: సుప్రీంలో కేంద్రం పిటిషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నల్ల కుబేరుల వివరాలు వెల్లడించలేం: సుప్రీంలో కేంద్రం పిటిషన్

విదేశాల్లో నల్లధనం దాచుకున్న కుబేరుల జాబితాను వెల్లడించలేమని నరేంద్ర మోడీ సర్కారు తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దానిపై ఈ నెల 28న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. కేంద్రం పిటిషన్ పై ప్రముఖ న్యాయవాది, నల్ల కుబేరుల జాబితా వెల్లడి కోసం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన రాం జెఠ్మలానీ మండిపడ్డారు. నల్ల కుబేరులను మోడీ ప్రభుత్వం రక్షిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం పిటిషన్ నేరచరితులను బలపరిచేదిగానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News