చంద్రబాబుకు రూ. 30 లక్షల చెక్ అందజేసిన బాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుకు రూ. 30 లక్షల చెక్ అందజేసిన బాలకృష్ణ

హుదూద్ తుపాను అపార నష్టాన్ని మిగిల్చిందని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన బాలకృష్ణ రూ.30 లక్షల చెక్కును సీఎం సహాయనిధికి ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ, బాధితులను ఆదుకునేందుకు అన్ని కార్యక్రమాలను చేపడతామని అన్నారు. గత 5 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలోనే ఉంటూ సహాయక చర్యలను ఉరకలెత్తిస్తున్నారని కొనియాడారు. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపడంలో చంద్రబాబు సఫలీకృతమయ్యారని కితాబిచ్చారు. చాలా ప్రాంతాలకు ఇప్పటికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని తెలిపారు. తుపాను నష్టాన్ని తగ్గించడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలమయిందని అన్నారు. ఎప్పుడు విపత్తులు తలెత్తినా ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుంటుందని తెలిపారు.

More Telugu News