తుపాను బాధితులకు అండగా నిలవండి: పవన్ కల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తుపాను బాధితులకు అండగా నిలవండి: పవన్ కల్యాణ్

తుపాను బాధితులకు అండగా నిలవాలని టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం వరద ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుందనే భావనతోనే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పర్యటనను విరమించుకున్నానని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారన్నారు. ఉత్తరాంధ్ర వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణలోని మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ ల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళుతున్నారని వవన్ కళ్యాణ్ తెలిపారు.

More Telugu News