రేపు ఖమ్మం వెళుతున్న పవన్ కల్యాణ్... ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానికి పరామర్శ!
సినీ నటుడు పవన్ కల్యాణ్ రేపు ఖమ్మం వెళుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమాని శ్రీజ(13)ను ఆయన కలవనున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీజ పవన్ ను కలవాలని కోరుకుంటున్నట్లు 'మేక్ ఏ విష్' ఫౌండేషన్ నిర్వాహకురాలు నిన్న (బుధవారం) మీడియా సమావేశంలో చెప్పారు. అందుకు పవన్ సహకరించాలని కూడా కోరారు. విషయం తెలుసుకున్న పవన్ వెంటనే సుముఖత తెలిపారు.