ఆరెస్సెస్ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆరెస్సెస్ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సమావేశాలకు హాజరు కానున్నారు. ఉత్తరప్రదేశ్ లోని సరస్వతి కుంజ్ లో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఆరెస్సెస్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాలుపంచుకునేందుకు అమిత్ షా, గురువారం రాత్రికే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకోనున్నారు. ఆరెస్సెస్ సమావేశాలకు హాజరయ్యేందుకే అమిత్ షా యూపీ వెళుతున్నారని బీజేపీ నేత ఒకరు చెప్పారు. రెండు రోజుల పాటు యూపీలోనే ఉండే అమిత్ షా, ఆరెస్సెస్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో పాల్గొననున్నారని కూడా సదరు నేత చెప్పారు. యూపీ పర్యటనలో భాగంగా అమిత్ షా, తొలుత లక్నోలో పార్టీ కార్యకర్తలతో స్వల్పకాలిక భేటీ అనంతరం నేరుగా సరస్వతి కుంజ్ వెళ్లనున్నారు. ఆరెస్సెస్ సమావేశాల్లో భాగంగా ఆయన విశ్వ హిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ మజ్దూర్ సంఘ్, విద్యా భారతి తదితర సంఘ్ అనుబంధ సంఘాల నేతలతోనే ప్రత్యేక భేటీలు నిర్వహించనున్నట్లు సమాచారం.

More Telugu News