కూతురికి పెళ్లికానుకగా బంగారు టాయిలెట్ బహుకరణ: సౌదీ రాజు అబ్దుల్లా రాజదర్పం
కూతురు పెళ్లి సందర్భంగా ఆమె కొత్త కాపురానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం ముస్లిం కుటుంబాల్లో చూస్తున్నదే. కుటుంబ ఆర్థిక హోదాను బట్టి ఈ ఏర్పట్లు సాధారణం నుంచి అసాధారణ స్థాయి వరకూ ఉంటున్నాయి. అయితే 21 బిలియన్ డాలర్ల ఆస్తితో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 500 మంది ముస్లిం కుబేరుల జాబితాలో వరుసగా స్థానం దక్కించుకుంటూ వస్తున్న సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా, తన కుమార్తె పెళ్లి సందర్భంగా ప్రపంచాన్ని నివ్వెరపరిచారు.
కుమార్తె పెళ్లి గౌనుకే 3 కోట్ల డాలర్లను వెచ్చించిన అబ్దుల్లా, దానిని పూర్తిగా బంగారంతోనే తయారు చేయించారు. అంతటితో ఆగని అబ్దుల్లా, కుమార్తె కొత్త కాపురం కోసం ఏకంగా ‘గోల్డెన్ టాయిలెట్’నే బహుమతిగా అందించారు. ఈ టాయిలెట్ లోని అన్ని పరికరాలు పూర్తిగా బంగారంతోనే చేసినవట. అయితే దీనికోసం అబ్దుల్లా ఖర్చుచేసిన మొత్తమెంత అన్న విషయం వెల్లడి కాలేదు. 11 మంది భార్యలున్న అబ్దుల్లాకు 16 మంది పిల్లలున్నారు.