నగ్న యోగాకు నానాటికీ పెరుగుతున్న డిమాండ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నగ్న యోగాకు నానాటికీ పెరుగుతున్న డిమాండ్!

యోగాకు భారత్ పుట్టిల్లు. యోగా వల్ల ఒనగూరే ప్రయోజనాలు తెలుసుకున్న విదేశీయులు భారత్ వచ్చి మరీ నేర్చుకున్నారు. తాజాగా వారు సరికొత్త యోగాను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. అదే నగ్న యోగా. అంటే, ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా యోగా చేయడమన్నమాట. తొలుత అమెరికా నగరం న్యూయార్క్ లో ప్రారంభమైన ఈ నయా యోగా మంత్రం, తాజాగా బ్రిటన్ రాజదాని లండన్ కూ పాకిందట. రెండేళ్ల క్రితం లండన్ లో ప్రారంభమైన ఈ తరహా యోగా తరగతులకు అక్కడి జనం వెల్లువలా తరలివస్తున్నారట. తాను చేపట్టిన నగ్న యోగాకు తొలి రోజు నుంచే ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో లండన్ వాసులు ఆసక్తి వ్యక్తం చేశారని దీనిని లండన్ కు పరిచయం చేసిన అన్నెట్టే చెబుతున్నారు. ఇప్పటికీ నిత్యం తాను నేర్పుతున్న నగ్న యోగా క్లాసులకు హాజరవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు. నగ్న యోగా వల్ల ఆత్మాభిమానం పెరగడమే కాక మానసిక ఒత్తిడి దూరమవుతోందట. ఇప్పటికే పాప్ గాయని లేడి గాగా, నగ్న యోగాను ప్రయోగించి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందారట.

More Telugu News