హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు అంతర్జాతీయ నిపుణులతో ప్రణాళిక: కేసీఆర్
హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు అంతర్జాతీయ నిపుణులతో ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో హుస్సేన్ సాగర్ ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, హుస్సేన్ సాగర్ హైదరాబాదు గౌరవాన్ని పెంచేదిగా ఉండాలని అన్నారు. సరస్సును అందంగా, పరిశుభ్రంగా చేసేందుకు సమగ్ర ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
హుస్సేన్ సాగర్ లో మురుగు నీరు కలవకుండా మళ్లింపు కాల్వలు కట్టాలని ఆయన సూచించారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ, నిమజ్జనాలపై త్వరలో హైదరాబాద్ నేతలతో సమావేశమవుతానని ఆయన చెప్పారు. సాగర్ పరిధిలోని భూభాగాన్ని పరిరక్షించడంలో కఠినంగా వ్యవహరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. గణేష్, దుర్గామాత, బతుకమ్మ ఉత్సావాల నిమజ్జనాలకు చిన్న సరస్సు నిర్మించాలని ఆయన సూచించారు. కొత్త సరస్సులో బోటింగ్ ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆయన తెలిపారు.