దేశంలో ఎక్కడికెళ్లినా ఇక ఫోన్ నెంబర్ మారదు... రోమింగ్ పడదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశంలో ఎక్కడికెళ్లినా ఇక ఫోన్ నెంబర్ మారదు... రోమింగ్ పడదు

దేశంలో ఎక్కడికెళ్లినా ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఎక్కడికెళ్లినా నంబర్ పోర్టబులిటీ అందుబాటులోకి రానుంది. 2015 మార్చి 31 కల్లా ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు టెలికాం శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడున్న విధానం ప్రకారం ఒక సర్వీస్ నెంబర్ అదే రాష్ట్రంలో నెంబర్ పోర్టబులిటీకి పనికి వస్తుంది. అది ఆ రాష్ట్రంలోనే పని చేస్తుంది. ఇతర రాష్ట్రం వెళ్తే రోమింగ్ లోకి వెళ్లిపోతుంది. ఈ రోమింగ్ ఛార్జీలు లేకుండా, దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఒకే నెంబర్ విధానం అమలయ్యేలా టెలికాం శాఖ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ట్రాయ్ చేసిన ప్రతిపాదనలను టెలికాం కమిషన్ ఆమోదించింది. దీనిపై టెలికాం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ ఆమోదముద్ర వేయడమే తరువాయి. దీంతో దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా సర్వీస్ ఆపరేటర్ ను మార్చుకోవచ్చు కానీ నెంబర్ ను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు.

More Telugu News